Friday 16 November 2012

Feed plus nutrient formula


ఫీడ్ ప్లస్ 

                          (ఈనిన /ఈనబోవు పశువుల కొరకు)

"ఫీడ్ ప్లస్" ఒక మంచి ఆహారపు విలువలు కలిగియున్న పోషక పదార్ధాలతో తయారుచేయబడిన అదనపు ఆహార సమ్మేళనం.దీనిలో ఈనబోవు మరియు ఈనిన పాడి పశువులకు కావలిసిన పోషక పదార్దాలు వున్నవి. ఈ సమ్మేళనంలోకాల్షియం, ఫాస్ఫరస్, వృక్ష సంభదిత గాలక్టగోగ్సు (అధిక పాల ఉత్పత్తి చేయు పోషకాలు) కొవ్వు పదార్ధాలు, మాంసకృత్తులు, విటమిన్లు,ఖనిజ లవణములు పశువులకు కావలసిన నిష్పత్తి లో వున్నవి, ఫీద్ద్ ప్లస్ ఆహార సమ్మేళనం పశువుల జీర్ణకోశం లో వున్న సూక్ష్మ జీవులను అభివృద్ధి కి తోడ్పడి పశువులకు పోషక పదార్దాలు అందించుట ద్వారా అధిక పాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

  ప్రతీ 100 గ్రాముల  ఫీడ్ ప్లస్ లో వున్న పోషకాలు  

  •   కాల్షియం                                    12.78 గ్రాములు  
  •   ఫాస్ఫరస్                                     4.37 గ్రాములు 
  •   విటమిన్ డి 3                               1000 యూనిట్లు 
  •   వృక్ష సంభదిత  గాలక్టో గోగ్స్           37.60 గ్రాములు 
  •   క్రొవ్వు పదార్ధాలు                          39.60 గ్రాములు 
  •   ఈస్ట్ కల్చరు                                 3.0 గ్రాములు 

దీనిని వాడుటవలన వలన కలుగు ప్రయోజనాలు 

  • పాలదిగుబడి పెరుగును 
  • పశువు యెక్క ఆరోగ్యమును కాపాడును 
  • పశువు యొక్క పునరుత్పత్తి సక్రమముగా యుండును 
  • జీర్ణశక్తి సక్రమముగా యుండును  
  • పాడిపశువులకు కాల్షియం లోపం రాకుండా చేసి పాలజ్వరము రాకుండా కాపాడును 
  • విటమిన్లు, ఖనిజ లవనములు  పశువునకు లభించును 
  • సులువుగా పశువుల దాణాలో కలిపి ఇవ్వ వచ్చును 
మోతాదు :    ప్రతీ పాడి పశువునకు  100 గ్రాములు దానాలో  కలిపి రోజుకు  రెండు సార్లు ఇవ్వవలెను.