కోడిగ్రుడ్లతో హల్వా
కావలసిన పదార్దాలు :
- కోడిగ్రుడ్లు తాజావి 6
- కోవా పంచదార లేనిది 100 గ్రాములు
- పంచదార 150 గ్రాములు
- నేయి 100 గ్రాములు
- జీడిపప్పు 50 గ్రాములు
- కిస్మిస్ 50 గ్రాములు
- మిఠాయి రంగు కొద్దిగా
- యాలకులపొడి ఒక స్పూను
చేయువిదానము :
ముందుగా కోడిగ్రుడ్లను ఒక గిన్నెలో కొట్టుకొని బాగా బ్లెండ్ చెయ్యాలి. దానిలో పంచదార పొడి, కోవా వేసి బాగా కలుపుకోవాలి. నేతిలో జీడిపప్పు , కిస్మిస్ వేపుకొని, వేరేగా వుంచుకోవాలి. గిన్నెలో అన్ని కలుపుకున్న మిశ్రమము పొయ్యి మీద పెట్టి నెయ్యి వెస్తూ ఆపకుండా కలపాలి. నెయ్యి ఫైకి చిమ్మాక జీడిపప్పు, కిస్మిస్, యాలకులపొడి, మిఠాయి రంగు వేసి బాగా కలిపి దించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా వుంటుంది.
శ్రీమతి శారద
విశాఖపట్నం
ఎడ్రస్సు
501, పయల ఎన్క్లేవ్, బాలయ్య శాస్త్రిలేఅవుట్
సీతమ్మధార , విశాఖపట్నం- 13