Wednesday 3 July 2013

mootrapimda maarpidi chaeyimchukunna vaaru teesukovalasina jagrattalu

     మూత్రపిండ మార్పిడి చేయించుకున్నవారు ఆహార విషయాలలో 

                                తీసుకోవలసిన జాగ్రత్తలు

మూత్రపిండ మార్పిడి తరువాత సమతుల్యమైన ఆహారం తీసుకోనుటవల్ల మూత్రపిండమును ఆరోగ్యంగా  వుంచు కొన వచ్చును. ఈ జాగ్రత్త తీసుకొనుట చాలా ముఖ్యం. 

తీసుకోవలసిన జాగ్రత్తలు:

మూత్రపిండ మార్పిడి అయిన తర్వాత సుమారు రెండు నెలలవరకు అధిక మాంసకృత్తులు (ప్రోటీన్సు) గల ఆహారం (పాలు, గ్రుడ్లు, చిక్కుళ్ళు, వెన్న, వేరుశనగలు,సోయా,బీన్సు,పప్పులు,ధాన్యాలు, రాగులు, సజ్జలు మొదలగు) తీసుకున్నట్లయితే శస్త్ర చికిత్స జరిగిన భాగం త్వరగా మానుటకు వీలుకల్గుతుంది . మరియు శక్తిని సమకూర్చుటకు ఈ మాంసకృత్తులు ఎంతగానో దోహదం చేస్తాయి. అందువలన కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా వుండేటట్లు చూసుకోవాలి. 

పొటాషియం:

మూత్రపిండ మార్పిడిలో వాడే మందులు రక్తంలో పోటాషియం స్థాయిని పెంచుతాయి, కనుక  తినే ఆహారంలో
 పొ టాషియం తక్కువగా వుండేటట్లు చూచుకోవాలి. అరటిపళ్ళు, బత్తాయి , కర్బూజా, బంగాళాదుంపలు, టొమాటోలు, ఆకుకూరలు, నిలువచేసిన పదార్ధాలలోనూ,పోటాషియం ఎక్కువగా వుంటుంది. కావున వీటిని తక్కువగా తీసుకోవాలి. 

మందుల వాడుకలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • మార్పిడి చేసిన మూత్రపిండమును ఆరోగ్యంగా వుంచుటకు వైద్యులు సూచించిన విధంగా మందులను తీసుకోనవలయును. 
  • కీసెప్ట్ ను ( Keysept ) ఖాళి కడుపుతో  వేసుకోనవలయును., 
  • Keygraf ను తీసుకొనేటప్పుడు ద్రాక్ష పళ్ళు, స్వీట్స్,సోడా, జ్యూ సులు, తీసుకొనకూడదు 
  • కీసెప్ట్ (Keysept ) వలన వాంతులు విరోచనాలు కళ్ళు తిరుగుటలాంటి వికారాలు వచ్చే అవకాశాలు వున్నాయి. కావున ఆహారం తక్కువ తక్కువ గా ఎక్కువసార్లు తీసుకొనవలయును. 
  • ఆహారంలో 25- 30 గ్రాముల పీచు పదార్దం తీసుకొనుట మంచిది. .

వ్యాయామం:

  • వ్యాయామం చేయుటవలన శరీరబరువును అదుపులో వుంచుకొన వచ్చును. 
  • ఎముకలు దృడంగా ఆరోగ్యంగా వుంటాయి 
  • అత్యవసర పనులు చేయవలసినపుడు  వైద్యుల సలహా తీసుకోనవలయును.