Sunday 10 March 2013



లేగదూడలలో  వచ్చు వ్యాధులు            

 1. లేగదూడ లలో  పారుడు వ్యాధి 
 2. దూడలలో మలబద్దకము 
 3. న్యుమోనియా 
 4. బోడ్డువాపు 
 5. గిలక వ్యాధి 
 6. లేగదూడలలో తెల్ల పారుడు వ్యాధి ( కొలిబాసిల్లోసిస్ )
 7. కాక్సీడియోసిస్  వ్యాధి 
 8. దిఫ్తేరియా వ్యాధి 
 9. దూడలలో ఏలిక పాముల బెడద  

 1. లేగదూడలలో  పారుడు వ్యాధి:

 లేగదూడలు అనేక కారణాల వాళ్ళ పారుకుంటాయి. ఈ క్రింద తెలిపిన కారణాల వలన సాధారణంగా దూడలు పారుకుంటాయి 
  1. అంతర పరాన్న జీవుల వలన 
  2. ప్రోటోజోవా అను పరాన్న జీవుల వలన 
  3. వైరల్ డయారియా 
  4. సూక్ష్మక్రిముల వలన 
  5. ఎక్కువ మోతాదులో పాలు త్రాగుట  వలన 
  6. వ్యాధినిరోధక శక్తి లేకపోవుట వలన 
  7. అపరిశుభ్ర వాతావరణం లో దూడలను వుంచుట వలన 

లక్షణాలు :

  1. దూడలు అకస్మాత్తుగా పారుకుతాయి 
  2. విరోచనాలు తెల్లగా కాని, చీము, రక్తం తో కాని కూడిఉంటాయి 
  3. కడుపునొప్పి 
  4. తల్లి వద్ద పాలు తాగవు  
  5. నిస్సత్తువుగా వుంటాయి  రక్త హీనత ఏర్పడుతుంది 
  6. శరీరం లో నీరు కోల్పోతాయి 
  7. సకాలంలో చికిత్స  చేయకపోతే దూడలు మరణిస్తాయి 

చికిత్స / నివారణ :

వ్యాధి సోకిన దూడలకు వెంటనే చికిత్స చేయించాలి
వ్యాధికి గల కారణాలను విశ్లేషించి తగు చికిత్స చేయాలి
దూడలను పరిశుభ్రమైన వాతావరణం లో వుంచాలి
దూడల శాలలను ఎప్పటి కప్పుడు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి
దూడలకు సకాలంలో ఏలిక పాములకు, నట్టలకు మందులు వేయాలి. దూడ పుట్టిన  10 రోజులలో మొదటిసారిగా ఏలిక పాములకు మందు వేయించాలి. తదుపరి ప్రతీ నెలకు ఒకసారి వేయాలి.
దూడలకు ముర్రు పాలు పుట్టిన  గంట లోపున తాగించాలి.
దూడలకు శరీర బరువును బట్టి పాలు ఎక్కువ తక్కువ కాకుండా ఇవ్వాలి.
విటమిన్ 'ఏ ' ఇంజక్షన్ 1500 యూనిట్లు వారాని ఒకసారి చొప్పున ఇవ్వాలి 3-4 నెలల వరకు ఇవ్వవచ్చును.ఇస్తే  వ్యాధుల నుంచి రక్షణ వస్తుంది.
వ్యాధిగ్రస్త దూడలను మంచి దూడలను  నుంఛి  వేరుచేసి చికిత్స చేయాలి
దూడలను మట్టి నాకకుండా మూతికి బుట్ట కట్టాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
దూడల  శాలల్లో దూడలను కిక్కిరిసి వుంచరాదు

2.  దూడలలో మలబద్దకము 

ఇది దూదలన్నిటిలోను మరియు  గేదె దూడలో ఎక్కువగా కనిపిస్తుంది. దూడలు పేడ వేయలేవు. ఆకలి తక్కువగా వుంటుంది దూడ మందకొడిగా వుంటుంది. దూడలకు ముర్రుపాలు తాగిస్తే మలబద్దకము రాదు. 

చికిత్స:

గ్లిసరిన్ ఎనిమా ఇవ్వాలి 
మెగ్నీషియం సల్ఫేట్  నీళ్ళలో కలిపి తాగించాలి 
దూడ తాగే పాలలో కోడి గుడ్డు సోన , చిటికెడు ఇంగువ, బెల్లం రెండు రోజులు తాగిస్తే తగ్గిపోతుంది 

3. దూడలలో న్యుమోనియా వ్యాధి 

దూదలలో ఈ వ్యాధి శీతాకాలంలో కాని వర్షా కాలాలలో కనిపిస్తుంది. దూడలకు చలి గాలులు సోకుటవలన  వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ వ్యాధి వస్తుంది. దూడలశాలలలో తేమ ఎక్కువగా వుంఛి  కిక్కిరిసి దూడలను వుంచినచొ ఈ వ్యాధి వస్తుంది

వ్యాధి లక్షణాలు :

  • జ్వరం తీవ్రంగా వస్తుంది 
  • ఆకలి మందగిస్తుంది 
  • దూడ మందకొడిగా వుంటుంది 
  • ముక్కుల నుండి చీమి కారుతుంది 
  • దగ్గు, ఊపిరి ఆయాసంగా తీసుకుంటుంది 
  • శ్వాస కష్టంగా తీస్తుంది 
  • వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేయకపోతే దూడలు చనిపోతాయి 

    చికిత్స /నివారణ :

  • యాంటిబయోటిక్స్ , యాంటిహిస్టమిన్ ఇంజక్షన్లు ఇవ్వాలి 
  • జున్ను పాలు సకాలంలో తాగించాలి 
  • శీతాకాలంలో  దూడలకు చలిగాలుల నుండి రక్షణ కల్పించాలి 
  • దూడల శాలలో దూడలను కిక్కిరిసి వుంచరాదు. గచ్చులు పొడిగా వుండాలి

4. దూదలలో బొద్దువాపు వ్యాధి   

దూదలలో తరచుగా వచ్చే వ్యాధి. బొద్దు వాచీ చీము పట్టి నొప్పిగా వుంటుంది. 
కారణాలు :
  • అపరిశుభ్ర వాతావరణంలో దూడను ఈనుటవలన  
  • ఈనిన తరువాత బొడ్డుకు మట్టి,పేడ వగైరా అంటుకొనుట వలన 
  • బొడ్డును కత్తిరించునపుడు  స్టేరిలైజు చేయని కత్తెర వాడుట వలన  
  • బొద్దునకు టించరు  అయోదినే వ్రాయక పోవుటవలన  
  • ముర్రుపాలు దూడకు సకాలం లో త్రాగించక పోవుట  కాని అసలు త్రాగించక  పోవుట  మొదలగు కారణాలవలన బొద్దు వాచీ చీము చేరుతుంది

లక్షణాలు :

  • దూడలకు జ్వరం 
  • పాలు త్రాగవు  
  • బొద్దు వాచీ చీము పడుతుంది 

చికిత్స :

  • బొద్దును పరీక్ష చేసి చీము వున్నదని నిర్ధారణ అయిన తర్వాత చీమును తొలగించి  యాంటిసెప్టిక్ లోషన్ తో కడిగి కట్టు కట్టవలెను. అవసరమునుబట్టి యాంటిబయోటిక్ మందులను ఇంజక్షను ద్వారా చేయాలి. సరిఅయిన జాగ్రత్తలు తీసుకోనకపోతే వ్యాధి ముదిరి కీళ్ళు వాచీ పోయే ప్రమాదము వున్నది. 

నివారణ

  • పరిశుబ్రమయిన ప్రదేశాలలో ఆవులు ఈనునట్లు చూడాలి 
  • పుట్టిన దూడలకు 2-3 అంగుళాల దిగువున బొద్దు కత్తిరించి ఆయోదిన్ ను కాని ప్రోవిదొనే అయోడిన్ కాని  పూయాలి 
  • దూడలు పుట్టిన గంట లోపున  ముర్రు పాలు త్రాగించాలి  

5. దూడలలో తెల్ల విరోచనాలు( కోలిబాసిల్లోసిస్ ) :

  • 3-5 రోజుల వయస్సు గల  లేగదూడలకు  ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి నిరోధకశక్తి  లేకపోవుట వలన అపరి శుభ్రమైన వాతావరణం లో దూడలనువుంచుట వలన' ఇ' కోలై అను సూక్ష్మక్రిమివలన  ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చిన లేగదూడలకు తెల్లటి నీళ్ళ విరోచనాలు అవుతాయి. దూడలు శరీరంలోని నీటిని కోల్పోయి నిస్సత్తువగా అయి మరణిస్తాయి. దూదలలో ఎక్కువ మరణాలకు ఈ వ్యాధి ఒక ముఖ్య కారణం. ఈ సూక్ష్మ క్రిమి దూడల జీర్ణకోశం లో చేరి విషపదార్ధాలను విడుదల చేస్తాయి. వీటి ప్రభావం వలన ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 

వ్యాధి వచ్చుటకు కారణాలు  

  • పరిసరాల అపరి శుభ్రత 
  • పాడి పశువును అపరి శుభ్రవాతావరణంలో వుంచుటవలన పోడుగు ద్వారా సూక్ష్మ క్రిములు దూడ శరీరంలో ప్రవేశించి  వ్యాధిని కలుగ చేస్తాయి. 
  • జున్ను పాలు దూడలకు ఇవ్వకపోవుట వలన వ్యాధి నిరోధక శక్తి లేక వ్యాధికి గురి అవుతాయి 
  • ఆహారం లో పోషక పదార్ధాల లోపం 
  • ఎక్కువ వెన్న శాతం వున్న  పాలను ఇచ్చుట 
  • విటమిన్ 'ఏ' లోపం 
  • దూడలు మట్టిని నాకుట 

లక్షణాలు 

  • తెల్లటి నీళ్ళ విరోచనాలు, దుర్వాసనతో కూడి వుంటాయి
  • విరోచనాలు అయినప్పుడు దూడలు తినుకుతాయి, కడుపు నొప్పి 
  • దూడలు శరీరంలో నీటిని కోల్పోతాయి 
  • కొన్ని సమయాలలో రక్తం,మ్యూకస్ పొరలతో కూడి వుంటాయి. 
  • జ్వరం 
  • త్వరగా బరువును కోల్పోతాయి 

చికిత్స  

  • ఫ్యురజోలిదిన్ 50 మి గ్రాములు/ కిలోగ్రాము శరీర బరువునకు రోజుకు రెండు సార్లు ఇవ్వాలి 
  •  క్లోరోంఫెనికాల్  25-30  మీ గ్రా/  కిలోగ్రాము శరీర బరువునకు  
  • యాంపిసిల్లిన్ 7-10 మి గ్రా / కిలోగ్రాము శరీర బరువునకు 
  • టెట్రాసైక్లిన్ 5-10 మి గ్రా / కిలోగ్రాము శరీర బరువునకు ఇవ్వాలి 

నివారణ 

  • జున్ను పాలు దూడలకు తప్పకుండా ఇవ్వాలి  
  • ఎక్కువ వెన్న శాతం వున్నా పాలు ఇవ్వరాదు 
  • దూడల సాలలు పరిశుభ్రం గా వుంచి ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి 
  • పశువుల శాలలలో గాలి, వెలుతురు తగిలేటట్లుగా  వుంచాలి 
  • దూడలకు ఆహారం సరియైన మోతాదులో ఇవ్వాలి 

6. దూదలలో గిలక వ్యాధి (hernia )

  • పుట్టిన లేగదూదలలో ఉన్నటువంటి యురేకస్  ట్యూబు (దూడయొక్క మూత్రాశయమునకు మావిని కలిపే నాళము ) మరియు తల్లినుండి వచ్చు రక్త నాళాలు సాధారణంగా 2-3 రోజులలో కుంచిం చుకు పోయి ఎండి పోతాయి. కాని కొన్ని సమయాలలో అవి సూక్ష్మ జీవులవల్ల ఇన్ఫెక్షన్ చేరి అవి బయటకు వచ్చు మార్గము మూసుకొని పోదు. ఆ రంద్రం నుండి దూడ కడుపులో వున్నా సన్నటి పేగు జారుతుంది. దీనినే గిలక అని అంటారు. 

లక్షణాలు 

  • బొద్దు వాపు 
  • జ్వరం  
  • కొన్ని సమయాలలో వాపునుంచి  మూత్రం వచ్చుట 
  • ఎదుగుదల తగ్గి పోవుట 
  • పాలు సరిగా తాగవు 
  • వాపును జాగ్రత్తగా గమనించి కొద్దిగా పోట్టలోనికి  వేలు పెట్టి నొక్కినట్లయితే రంద్రంను గమనించవచ్చును. బొద్దు లోకి జారిన పీగును లోనికి త్రోయవచ్చును 
  • బొద్దు చీముకు దీనికి తేడా గమనించవచ్చును 

చికిత్స /నివారణ 

  • హెర్నియా  చిన్నదయినా యెడల చికిత్స లేకుందగనే మాని పొవును. పొట్టనుండి  జారిన పేగు, రంద్రము పెద్దదయిన యెడల శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే నయమగును. పెనిసిల్లిన్, యితర యాంటిబయోటిక్ మందులను ఇచ్చినచో త్వరగా నయమగును. దూడ పుట్టిన వెంటనే బొద్దునకు టించర్  అయోడిన్ పోసిన యెడల బొద్దులోనికి సూక్ష్మక్రిములు ప్రవేశించ లేవు . 

    7. దూడలలో కాక్సిడియోసిస్  వ్యాధి

    'ఇమీరియా' అనబడు ప్రోటోజోన్ పరాన్నజీవివలన ఈ వ్యాధి వచ్చును. ఈ వ్యాదివలన మరణముల  సంఖ్య చాలా ఎక్కువ. ఇది వొక నెల నుండి  సంత్సరము వయస్సు గల దూదలలో వచ్చు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన దూడలు రక్తము, మ్యుకస్ పొరలతో కూడిన విరోచనాలతో పారుకుంటాయి. పారు తున్నపుడు ఎక్కువగా తినుకుతాయి. పేడ దుర్వాసన తో కూడి యుంటుంది. దూడకు కడుపు నొప్పి కూడా వుంటుంది. తోకకు, తొడల పైన జిగట అంటుకొని వుంటుంది. ఈ వ్యాధి గొర్రెలు, మేకలు, కోళ్ళకు కూడా   వస్తుంది.వ్యాధికారక క్రిములయొక్క గ్రుడ్లు కలుషిత నీరు, మేత ద్వారా  వ్యాప్తి చెందుతాయి.

    లక్షణాలు:

    వ్యాధికారక  గ్రుడ్లు శరీరం లో ప్రవేసించిన  తరువాత 15 -20 రోజులలో వ్యాధిని కలుగ చెస్తాయి. జీర్ణకోశములో వృద్ధి చెంది పెద్ద ప్రేగులలోని సీకం, కోలన్ లలో వ్యాధిని కలుగ చేస్తాయి . 
    1. ఎక్కువగా పారుట 
    2. పారునప్పుడు తినుకుట 
    3. రక్తం, మ్యుకస్ పొరలతో కూడియున్న విరోచనాలు 
    4. కండరాల వణుకు  మొదలగు లక్షణాలు కనిపిస్తాయి

    వ్యాధి నిర్ధారణ  

    పేడ పరిక్ష ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చును.

    చికిత్స  

    యాంప్రోలియం 10 మి గ్రా /కిలోగ్రాము శరీర బరువునకు  రోజుకి ఒక సారి చొప్పున 4-5 రోజులు ఇవ్వాలి సల్ఫా మందులు (సల్ఫామితాక్సోలే)20 మి గ్రా /కిలోగ్రాము శరీర బరువునకు  రోజుకి ఒక సారి చొప్పున 4-5 రోజులు ఇవ్వాలి .

    8.  డిఫ్తీరియా వ్యాధి :

    ఇది దూడలకు వచ్చు ప్రమాదకరమైన వ్యాధి. లేగాదూదలలోను మరియు పెద్ద పశువులలోను ఈ వ్యాధి వస్తుంది.నెక్రొబాక్తీరిమ్ నేక్రోఫోరుస్ అను సూక్ష్మ జీవివల్ల  ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన  నీటి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

    లక్షణాలు:

    • నొప్పితో కూడియున్న దగ్గు  
    • చొంగ కార్చుట 
    • ఆహారం గుటక వేయుట చాలా కష్టంగా వుంటుంది  
    • స్వరపేటిక, ఫారింక్స్ ఫై మ్యుకస్ పొరలు ఊడిపోతాయి 
    • పశువులు మేత మేయలేవు , దూడలు పాలు తాగలేవు
    • దూడలు నీరసించి పోతాయి 
    • ఇతర అవయములకు ఊపిరితిత్తులకు , కాలేయమునకు  కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది 
    • దూడలు నీరసించి చనిపోతాయి

    వ్యాధి నిర్ధారణ 

    • లక్షణములను బట్టి  వ్యాధిని గుర్తించవచ్చు 
    • ప్రయోగశాలలో రక్తము, ముక్కునుండి కారిన స్రావమములనుండి తీసిన నమూనాలను పరీక్షించిన వ్యాధి కారక క్రిములను గుర్తించి వ్యాధి నిర్ధారణ చేయవచ్చును 

    చికిత్స  /నివారణ 

    • పెన్సిలిన్,  సల్ఫోనమైడ్స్ ఇచ్చినచో వ్యాధి నిమ్మళించును . పశువుల శాలలను క్రిమిసంహారక మందులతో తరచు కడుగుచుండవలెను

      9. దూడలలో ఏలిక పాముల బెడద (ascariasis )

       ఇది దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధి. గేదె దూదలలో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చి దూడలు చనిపోవును .ఎలికపాములవలన దూడలలో ఎదుగుదల తగ్గిపొవును. ఈ వ్యాధి ఆస్కారిడ్ అను అంతర పరాన్నజీవి వలన కలుగును (toxocara vitulorum ). గేది దూడలకు ఈ వ్యాధి ముర్రుపాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముర్రుపాలనుండి ఏలిక పాముల యొక్క గ్రుడ్లు దూడ శరీరంలోనికి ప్రవేసించి వ్యాధిని కలుగ చేస్తాయి. దూడలు పుట్టిన 2-5 రోజులలో వ్యాధి కారక పరాన్నజీవులు ముర్రు పాల ద్వారా దూడ కడుపు లోనికి ప్రవేసించి యెదుగుతాయి. కనుకనే దూడకు రెండు వారముల వయస్సు లోనే బాగా ఎదిగిన ఏలిక పాములు దూడ యొక్క కడుపులో కనుగొనగలము. 

      లక్షణాలు  

      1. దూదలలో ఎదుగుదల తగ్గును  
      2. శరీరంఫై వున్న  వెంట్రుకలు బిరుసుగా మారి మెరుపు వుండదు 
      3. తరచూ  కడుపునొప్పితో బాధపడుతూ వుంటాయి 
      4. రక్త హీనత, పాలు సరిగా త్రాగవు 
      5. దగ్గు, దుర్వాసనతో పారుడు
      6. పొట్ట పెద్దదగును (బాన పొట్ట) 

      చికిత్స  

      • ఫైపరిజిన్ సాల్టులు సాధారణంగా వాడుదురు.    ఫైపరిజిన్ యేడిపేట్ ఏలిక పాములకు చక్కటి మందు 100% పనిచేయును. డోసు: 0. 25 గ్రాములు /కిలోగ్రాము శరీర బరువునకు  నోటి ద్వారా ఇవ్వవచును
      •  ఫైరాన్ టెల్ ( pyrantel) 250 మి గ్రా / ఒక దూడకు లేక లివమిసోల్  7. 5. మి. గ్రా /కిలోగ్రాము శరీర బరువునకు ఇంజక్షన్ ద్వారా ఇవ్వవచ్చును 
      • ఐవర్మెక్టిన్ 0.2 మి గ్రా/కిలోగ్రాము శరీర బరువునకు  ఇంజక్షన్ ద్వారా