Thursday 4 April 2013

    పొదుగు వాపు వ్యాధి నిర్దారణ కొరకు రైతులే స్వయముగా చేయగలిగే 

                                      అతిసులువైన పరీక్ష 

పొదుగువాపు వ్యాధి అంటే ఏమిటి ?

ఎక్కువ పాలను ఉత్పత్తి చేయు పాడి పశువులలో  ఇది సాధారణంగా వస్తుంది. పొదుగు  లోనికి సూక్ష్మ జీవులు ప్రవేశించి ఈ వ్యాధిని కలుగచేస్తాయి. ఇది అన్ని పశువులలోను ముఖ్యముగా సంకర జాతి పశువులలోను, అధిక పాలు ఉత్పత్తి చేయు గేదలలోను.  ఈనిన  1-2 నెలలలో  కనిపిస్తుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది.చికిత్స చేయకపోయినట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగా మారి పొదుగు  పూర్తిగా  పాడైపోతుంది. రైతు ఆర్థికంగా చాలా నష్ట పడతాడు. కావున ఈ పొదుగు వాపు వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స చేయాలి.  

  పొదుగు వాపువ్యాది ఎన్నిరకాలుగా వస్తుంది ?

పొదుగు వాపు వ్యాధి మూడు రకాలుగా వస్తుంది 
1. వ్యాధి లక్షణాలు కనిపించకుండా వచ్చు వ్యాధి ( సబ్ క్లినికల్ )
2. వ్యాధి లక్షణాలు కనిపించుతూ వచ్చు వ్యాధి (క్లినికల్ )
3, దీర్ఘకాలిక వ్యాధి ( క్రానిక్ )

పైన తెలిపిన మూడింటిలో మొదటి వ్యాధి అతి ప్రమాద కరమైన వ్యాధి. ఈ వ్యాధిని గుర్తించుట చాలా కష్టము. ఈ దశలో చికిత్స చేయక పోయినట్లయిన వ్యాధి రెండవ దశ  లోకి పోయి  తీవ్రతరమైనదిగా మారిపోతుంది.రెండవ దశలో  లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయ వచ్చు.  . మూడవ దశలో చికిత్స చేయుట చాలా కష్టము. కాబట్టి వ్యాధిని ప్రధమ దశలోనే గుర్తించి చికిత్స చేయాలి. 

పోడుగువాపు వ్యాది రెండవ దశలో లక్షణాలు . 

  • పాలు విరుగుట 
  • తెల్లటి ముక్కలు కనిపించుట 
  • పాలు నీరు లాగ అయి పోతాయి 
  • పొదుగు  వాపు 
  • నొప్పి   

పొదుగు వాపు వ్యాది మూడవదశలో లక్షణాలు :

  • పొదుగు  గట్టిబడి రాయిలాగ మారుతుతుంది 
  • పాలు పూర్తిగా పోతాయి 
  • చనుకట్లు  గట్టిబడతాయి 
  • మిగతా చనుకట్లకు వ్యాధి వ్యాపిస్తుంది  

వ్యాధిని మొదటిదశలో గుర్తించుట ఎలా ?

ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించుటకు ఒక సులువైన పద్దతి కలదు. దీనిని అనేక దేశాలలో ఉపయోగించి మంచి పలితాలు సాదించారు. దీనిని రైతులే  స్వయంగా ఇంటివద్దనే చేయగల పరీక్ష. ఈ పరీక్ష ద్వారా  పొదుగు వాపు వ్యాధిని ఆది లోనే గుర్తించుటకు వీలు కలుగుతుంది. 

చేయు విధానము: (ఇళ్ళలో వాడుకునే సుర్ఫ్ తో చేయుట ) 

  • ముందుగా సుర్ఫ్ ఎక్సెల్ 5-6 చెంచాలు తీసుకొని అర లీటరు నీటిలో కలపాలి. ఈ నీటిని ఒక ప్లాస్టిక్ సీసాలో బద్ర పరచుకోవచ్చును. 3 నెలల వరకూ నిలువ వుంచుకొన వచ్చును. సీసాను వెలుతురు  తగలని చోట జాగ్రత్త చేయాలి. 
  •  పరీక్ష చేయవలసిన పాడిపశువు నుండి పాలను సేకరించాలి. నాలుగు చనుకట్లనుండి  పాలను విడివిడిగా సేకరించాలి. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసులో 10 మి.లీ పాలను తీసుకొని 10 మి.లీ . సుర్ఫ్ నీళ్ళను  కలపాలి.1 0 సెకండ్ల సేపు నెమ్మదిగా ఆ మిశ్రమాన్ని కలపాలి. పోడుగువాపు వ్యాధి ఉన్నట్లయితే ఆ మిశ్రమము ముద్దగా అయిపోతుంది. వ్యాదిలేనట్లయితే ఏమి మార్పు రాదు. 

    దీనిని కనీసం వారానికి ఒక సారిఅయినా చెస్తూ ఉన్నట్లయితే పొదుగు వాపు వ్యాధిని ఆది లోనే గుర్తించి సరిఅయిన సమయంలో చికిత్స చేసుకోవచ్చును,మనయొక్క పాదిపశువులను ఈ వ్యాది బారి నుండి కాపాడుకోవచ్చును.  







 


No comments:

Post a Comment