మిన్సిడ్ చికెన్ ఫ్రై
- కావలసిన పదార్ధాలు :
- బోన్ లె స్ చికెన్ 500 గ్రాములు
- ఉల్లిపాయలు పెద్దవి 3
- పచ్చి మిర్చి కాయలు 4
- అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు
- ధనియాలు పొడి 2 స్పూన్లు
- జీలకర్ర పొడి 1 స్పూను
- మసాల పొడి 2 స్పూన్లు
- ఉప్పు తగినంత
- పసుపు 1/2 స్పూను
- కారం సరిపడినంత
- నూనె తగినంత
- జీడిపప్పు 50 గ్రాములు
- కొత్తిమీర ఒక చిన్న కట్ట
- తయారుచేయు విధానము :
ముందుగా కోడిమమాంసమును శుభ్రముగా కడిగి ఒక గిన్నె లో వుంచి ఉడికించాలి. నీరంతా ఇగిరి పోయే దాకా వుంచి తరువాత తీసి చల్లారనియ్యాలి.. చల్లారినతర్వాత గ్రైండర్ లో వేసి మెత్తగా కీమా లాగ చేయాలి. ఆ కీమాలో తగినంత ఉప్పు, కారం, పసుపు,ధనియాలపొడి, జీలకర్రపొడి, మసాలాపొడి వేసి కలిపి వుంచాలి. పెనములో కొంచం నూనె వేసి జీడిపప్పును వేయించుకోవాలి. మిగతా నూనెలో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేగాక కోడిమాంసం ముద్దను వేసి సిమ్ లో వేపుకోవాలి. వుడికిన తర్వాత జీడిపప్పు కొత్తిమేర వేసి దించాలి. ఈ చికెన్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టం గా తింటారు.
శ్రీమతి. జి. వి. లక్ష్మి
విశాఖపట్నం-13
అడ్రస్
11, సాయిసౌద అపార్ట్మెంటు బాలయ్య శాస్త్రి లే అవుట్
4 వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర
విశాఖపట్నం-13
అడ్రస్
11, సాయిసౌద అపార్ట్మెంటు బాలయ్య శాస్త్రి లే అవుట్
4 వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర
విశాఖపట్నం-13
No comments:
Post a Comment