Tuesday, 11 December 2012
Friday, 16 November 2012
Feed plus nutrient formula
ఫీడ్ ప్లస్
(ఈనిన /ఈనబోవు పశువుల కొరకు)
"ఫీడ్ ప్లస్" ఒక మంచి ఆహారపు విలువలు కలిగియున్న పోషక పదార్ధాలతో తయారుచేయబడిన అదనపు ఆహార సమ్మేళనం.దీనిలో ఈనబోవు మరియు ఈనిన పాడి పశువులకు కావలిసిన పోషక పదార్దాలు వున్నవి. ఈ సమ్మేళనంలోకాల్షియం, ఫాస్ఫరస్, వృక్ష సంభదిత గాలక్టగోగ్సు (అధిక పాల ఉత్పత్తి చేయు పోషకాలు) కొవ్వు పదార్ధాలు, మాంసకృత్తులు, విటమిన్లు,ఖనిజ లవణములు పశువులకు కావలసిన నిష్పత్తి లో వున్నవి, ఫీద్ద్ ప్లస్ ఆహార సమ్మేళనం పశువుల జీర్ణకోశం లో వున్న సూక్ష్మ జీవులను అభివృద్ధి కి తోడ్పడి పశువులకు పోషక పదార్దాలు అందించుట ద్వారా అధిక పాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
ప్రతీ 100 గ్రాముల ఫీడ్ ప్లస్ లో వున్న పోషకాలు
- కాల్షియం 12.78 గ్రాములు
- ఫాస్ఫరస్ 4.37 గ్రాములు
- విటమిన్ డి 3 1000 యూనిట్లు
- వృక్ష సంభదిత గాలక్టో గోగ్స్ 37.60 గ్రాములు
- క్రొవ్వు పదార్ధాలు 39.60 గ్రాములు
- ఈస్ట్ కల్చరు 3.0 గ్రాములు
దీనిని వాడుటవలన వలన కలుగు ప్రయోజనాలు
- పాలదిగుబడి పెరుగును
- పశువు యెక్క ఆరోగ్యమును కాపాడును
- పశువు యొక్క పునరుత్పత్తి సక్రమముగా యుండును
- జీర్ణశక్తి సక్రమముగా యుండును
- పాడిపశువులకు కాల్షియం లోపం రాకుండా చేసి పాలజ్వరము రాకుండా కాపాడును
- విటమిన్లు, ఖనిజ లవనములు పశువునకు లభించును
- సులువుగా పశువుల దాణాలో కలిపి ఇవ్వ వచ్చును
మోతాదు : ప్రతీ పాడి పశువునకు 100 గ్రాములు దానాలో కలిపి రోజుకు రెండు సార్లు ఇవ్వవలెను.
Monday, 29 October 2012
circular
సాయి సౌధ అపార్ట్ మెంటు వెల్ఫేర్ అసోసియేషన్
విశాఖపట్నం-13
30/10/2012 సర్కులర్
_______________________________________________________
సాయి సౌద అపార్ట్ మెంటులో నివసిస్తున్న అందరిని నీటిని వృధా చేయవద్దని కోరడమైనది. ఈ మధ్య నీటికొరకు పడ్డ ఇబ్బంది అందరికి తెలిసినదే రోజుకు రెండు టాంకుల నీరు కొన్నా ఏ మూలకు మనకు సరిపోలేదు.ఒక్క టాంకు ఖరీదు 900 రూపాయలు..కాబట్టి నీరు ఏంత ఖరీదో అందరికీ తెలిసి వుండాలి. అందువలన దయచేసి టాపులు ఏమైనా లీకులు వగైరా వుంటే రిపేరు చేయించుకోవలసిందిగా మరియు నీటిని వృధా చేయవద్దని కోరడమైనది. అన్దరూ ఈ విషయములో సహకరించవలసినదిగా అర్ధించుచున్నాము. రాబోయేది ఎండా కాలం భూమిలో వున్న జలం ఎంతవరకు సరిపడుతుందో చెప్పలేము..మోటారు వేసినప్పుడే మంచి నీరు పట్టుకోవలసినదిగా కోరడమయినది.
ప్రెసిడెంటు
సాయి సౌధ అపార్ట్ మెంటు వెల్ఫేర్ అసోసియేషన్
Friday, 26 October 2012
vulava boorlu
ఉలవ బూరెలు
తయారు చేయుటకు కావలసిన పదార్ధాలు :
- ఉలవలు 1 కప్పు
- కోరిన బెల్లం 1 కప్పు
- మినప పప్పు 1/2 కప్పు
- బియ్యం 1 కప్పు
- యాలకుల పొడి 1 టీ స్పూను
- నూనె తగినంత
ముందుగా మినపపప్పుని,బియ్యాన్ని 2 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో రెండు స్పూన్ల కోరిన బెల్లం, చిటికెడు ఉప్పు కలిపి వుంచుకోవాలి.(బూర్ల తోపునకు )
ఉలవలు దోరగా వేపి, కడిగి కుక్కరులో 5-6 విజిల్సు వచ్చే దాకా ఉడికించుకోవాలి.చల్లారిన తర్వాత గ్రిండర్ లో మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత బెల్లం పాకం చేసుకొని(బెల్లం కరిగినంతవరకు ) రుబ్బిన ఉలవ ముద్దను వేసి దగ్గరగా చేయాలి. అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ ముద్దతో కావలిసినంత సైజు లో ఉండలు గుండ్రంగా చేసుకోవాలి .ఈ ఉండలను తోపులో ముంచి నూనెలో వేపాలి.
వేడి వేడి గా తింటే (నేతితో కలిపి ) చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచివి. అప్పుడప్పుడు చేసుకోవచ్చును.
శ్రీమతి. జి. వెంకట లక్ష్మి
c/o డా. జి.బి.హరనాద్
11, సాయి సౌద ఎపార్ట్మెంటు, బాలయ్య శాస్త్రి లేఅవుట్, 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ దరి
విశాఖపట్నం -13 ఫోను నెంబర్ :9247582402, 9848721121.
Wednesday, 17 October 2012
song by dr.soma
పల్లవి : ఓ మధు పాయీ ఓ మధుపాయీ
ఎటకే ఈ పూట వనిలో ఎదే నీ బాట
చరణం : కన్నె సుమములు అభిసారికలై కాచుకున్నవి నీ కోసం
సప్తవర్ణముల రేఖలు విరిచూచుచున్నవి నీకోసం
పల్లవి : ఓ మధు పాయీ ఓ మధుపాయీ
ఎటకే ఈ పూట వనిలో ఎదే నీ బాట
చరణం : చంద్రుని కోరే చకోరములవలె ఎదురు చూచె నీ సుమబాలలు మరి
ఎందుకే జాగు ఎగురుతుపోవే ఉషోదయమ్మున నిషా కొరుతూ
పల్లవి : ఓ మధు పాయీ ఓ మధుపాయీ
ఎటకే ఈ పూట వనిలో ఎదే నీ బాట
చరణం : బిరానపోయి సరాగ ధూళితో సరాగమాడి తరించి పోవే
ఝుమ్మని నాదం కమ్మగ మీటే ఝుంటి తేనియలు జుర్రుకు రావే
పల్లవి: ఓ మధు పాయీ ఓ మధుపాయీ
ఎటకే ఈ పూట వనిలో ఎదే నీ బాట
Dt/ 14-10-2012
Visakhapatnam రచయిత : డా. సోమ
item song by dr soma
పల్లవి : ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం
చరణం : నెత్తిమీద కూర తట్ట నోటిలోన ఘాటుచుట్ట
నత్తనడక వన్నెలాడి నాకు నచ్చేవే ఇచ్చైవే వచ్చైవే
పల్లవి : ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం
చరణం : కూర బేరమాడ వస్తే చుట్ట మాట కడ్డు వస్తే
దింపలేక గింగెక్కని గింగెక్కని గింగిరాలు పోయావే
నువ్వు నాకు నచ్చేవే ఇచ్చైవే వచ్చైవే
పల్లవి: ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం
చరణం కిందెట్టని అనలేక గింగెట్టని నువ్వంటే గంగ వెర్రులేసింది
నా మనసు గిర్రని బొంగరంలా తిరిగింది నా వయస్సు
నచ్చేవే ఇచ్చైవే వచ్చైవే
కోరస్: గింగెట్టు తట్టని గింగెట్టు ఒంగెట్టు బుట్టని ఒంగెట్టు
ఒంగిగింగ పెట్టి నీవు బుట్టలోన సరుకంతా చూపెట్టు
కాదంటే నా వొట్టు అద్దిగది ఆహా ! అద్దిగది ఓహో అగ్గిగది
పల్లవి: ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం
చరణం 4: బుట్ట దించి నేను చూస్తే తాజాగా లేత లేత వంకాయలూ
ముల్లంగి మునగా మరి టెంకాయలూ
పల్లవి: ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం
చరణం 5: పున్నాగ పువ్వులాగ సన్నాయి నడుము దాన
చాల్లే నీ వయ్యారం ఒగ్గై నీ సింగారం ఇచ్చై నీ బంగారం
విశాఖపట్నం రచయిత : డా. సోమా
14/10/2012
Sunday, 14 October 2012
సూక్ష్మదర్శిని
సూక్ష్మదర్శిని (Microscope)
పశువుల వ్యాధులకు కారకములయిన సూక్ష్మజీవుల గూర్చి తెలుపు పశువైద్య శాస్త్ర విభాగమును "పశువైద్యసూక్ష్మజీవ శాస్త్రము " అని అందురు.( Veterinary Micro Biology) ఈ శాస్త్రములో అంటు వ్యాధులు, వాటియొక్క కారకములను గుర్తించుట, పశువుల ఫై అవి చూపు ప్రభావములను, నిరోధించు మార్గములను, మరియు వ్యాధుల నివారణ మొదలగు అంశములను ఈ శాస్త్రములో చర్చించెదరు.
పూర్వము సూక్ష్మదర్శినిని కనుగొనక ముందు వ్యాదులకు కారకము లైన సూక్ష్మజీవుల యొక్క ఉనికి తెలియకపోవుట చే గాలి, దెయ్యము మొదలగు వాటివల్ల వ్యాదులు వస్తాయని భావించే వారు. తదుపరి శరీర తత్వము , ఆహార లోపాలవల్ల వ్యాదులు వస్తాయని విస్వసిం చే వారు.
కాలక్రమేణా సూక్ష్మదర్శినిని కనుగొన్న తర్వాత వ్యాదుల కా రణములను సూక్ష్మజీవులుగా గుర్తించ గలిగిరి. ఈ ఘనత అంటోని లీవెన్ హుక్ కే దక్కుతుంది. ఈ సూక్ష్మదర్శినిని కనుగొన్న రెండు శతాభ్దముల తర్వాత సూక్ష్మజీవుల యొక్క పూర్తి వివరములు తెలుసుకో గలిగారు. ఈ ఘనత లూయి పాక్చరుకే దక్కుతుంది. అందువలన లూయి పాక్చరును సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు గా పిలిచెదరు.(Father of the modern microbiology) .
ఆంటోని లీవెన్ హుక్ అను శాస్త్రజ్ఞుడు సూక్ష్మ దర్శిని ని కనుగొన్నాడు. ఇతడు హాలండ్ దేశస్థుడు. (1632-1723).ఈయన విభిన్న రకములైన సూక్ష్మ దర్శినిలను కనుగొన్నాడు. సుమారు 250 రకములైన సూక్ష్మ దర్సినులను స్వయంగా ఉత్పత్తి చేసాడు. ఈయన చే తయారుకాబడిన సూక్ష్మ దర్సినులకు ఆకాలంలో విశేష ప్రాచుర్యం లభించినది. అతి చిన్న కంటికి కనిపిచని వస్తువులను ఎన్నో రెట్లు పెద్దవిగా చేసి చూపించగల పరికరం సూక్ష్మ దర్శిని. సూక్ష్మజీవులయొక్క పరిమాణం, ఆకృతి వంటి భౌతిక లక్షణాలను సూక్ష్మ దర్శిని సహాయంతో పరిసీలిచుటకు వీలు కల్గుతుంది.
సూక్ష్మదర్శినిలో రకాలు :
1. సాధారణ సూక్ష్మ దర్శిని (Simple microscope/ Light Microscope): దీనిలో వస్తువు యొక్క పరిమాణంను పెంచుటకు కటకములను, కాంతిని ఉపయోగిస్తారు. ఇందులో 1000 రెట్లు వస్తువుయొక్క పరిమాణంను పెంఛి చూపవచ్చును.
2.సంయుక్త సంయోగ సూక్ష్మ దర్శిని (Compound Microscope): ఇది సాధారణంగా సూక్ష్మ జీవ శాస్త్రం లో ఉపయోగించే పరికరము. దీనిలో ఏకాక్షక , ద్వియాక్షక అను రెండు రకములైన వి వుంటాయి. ఏకాక్షక సూక్ష్మ దర్సినిలో వొక కన్నుతోనే చూడగలము.ద్వియాక్షక సూక్ష్మ దర్సిని లో రెండు కళ్ళ తొనూ చూడగలము.(Monoocular, Binocular microscopes). ఏకాక్షక సూక్ష్మ దర్సినితో ఎక్కువ సేపు పరిక్ష చేయుటకు వీలు పడదు. ద్వియాక్షక సూక్ష్మ దర్సినీతో రెండు కళ్ళ తొనూ పరీక్ష చేయుటకు వీలు కలుగుతుంది..ఈ సంయుక్త సూక్ష్మ దర్సినిలో చాలా రకములు యున్నవి .
ద్యుతిక్షేత్ర సూక్ష్మ దర్శిని (Bright field microscope): ఇది సాధారణంగా వాడే సూక్ష్మ దర్శిని. ఎక్కువ కాంతిని ఉప యో గించి సూక్ష్మ జీవులను పరీక్షిం చెదరు. వస్తువులు కాంతిని స్వీకరించుట చేత కాన్తిరహితముగా కనిపిస్తాయి . అందువలన సూక్ష్మ జీవులను పరీక్షించుటకు వస్తువులను అభిరంగితము చేయవలెను( Staining). చాలా రకములయిన స్టైన్స్ ను వాడి సూక్స్జ్మ జీవుల ఆకృతి, మొదలగు అంశములను పరీక్షిం చెదరు
కాంతిరహిత సూక్ష్మ దర్శిని:( Dark field microscope):దీనిలో వస్తువు కాం తి రహితంలో కాంతిగా కనిపిస్తుంది .వొక ప్రత్యేకమైన కన్దెన్ సర్ ను ఉపయోగించి కాంతిని వొక ప్రత్యేకమైన కోణంలో ప్రసరింప చేస్తారు .సిఫిలిస్ , మొదలగు వాటిని దీనితో పరీక్షింస్టారు.అభిరంజితము చేయకుండా సూక్ష్మ జీవులను ఈ పరికరము సహాయంతో సులువుగా పరీక్షించవచ్చును.
వత్యాతదశ నిరూపణ సూక్ష్మ దర్శిని (Phase contrast Microscope): దీనిలో వొక ప్రత్యేకమైన కండెన్సర్ ద్వారా కాంతిని వొక విభిన్న మార్గంలో ప్రసరింప చేస్తారు అం దువలన వస్తువు ప్రస్పుటంగా కనిపిస్తుంది.సూక్ష్మ క్రిములను అభిరంజితము చేయకుండా చూడ వచ్చును .
ప్రతిదీప్త సూక్ష్మ దర్శిని ( Fluorescent microscope): ఈ సూక్ష్మ దర్శిని ద్వారా చూచునపుడు కాంతితో మెరిసె డైతో స్టైన్ చేసి అధిక శక్తితో కాంతిని వేద జల్లే హలోజిన్ బల్బు గాని మెర్సురిక్ వ్యాపర్ బల్బు గాని ఉపయోగించి కాంతిని ప్రసరింప చేయుదురు. అందువలన సూక్ష్మ క్రిములను సులభంగా గుర్తించుటకు వీలుకల్గుతుంది.
ఎలక్ట్రాన్ మైక్రో స్కోపు (Electron microscope): అత్యంత ఆధునికమైన సూక్ష్మ దర్శిని. దీనిలో ఎలక్ట్రాన్ కిరణములను ఉపయోగించి సామాన్య సూక్ష్మదర్శిని కన్నా ఇంకను 1000 రెట్లు పెద్దదిగా చేసి చూపించగలదు.సూక్ష్మ జీవులోగల కణములను ఇతర సూక్ష్మ భాగములను, వైరస్ లను,దీనితో సులభంగా చూడవచ్చును.
సూక్ష్మ దర్శిని లోగల భాగాలు :
1.కంటితో చూచే కటకం (eye piece)
2. Revolving nose piece( వస్తు కటకంలను త్రిప్పుకునే సాధనం ): దీనిలో 10X, 20X,40X, 100X కటకములను అమర్చేదరు.దీని సహాయంతో ఏదైనా వొక కటకంతో చూడవచ్చును.
3.వస్తుకటకములు (objectives)
4.స్టేజి: ఇది నిలువుగాను అడ్డంగాను కడుపుకొని స్టేజి పైన పెట్టిన స్లైడ్ ను కదుపుకోనవచ్చును.
5.కండెన్సర్: కిరణములను రుజుకిరణములుగా మారుస్తుంది. దీనిలో వున్న డయాఫ్రం ద్వారా కాంతి కిరణ ములను తగ్గించుట, హెచ్చిం చుట చేయవచ్చును.
6. లైట్ సోర్సు
7.స్టేజి క్లిప్స్ : స్లైడ్ ను పట్టి కదలకుండా ఉంచుటకు తోడ్పడుతుంది
8. మైక్రోస్కోప్ ను పైకి, క్రిందికి కదుపుకోనుటకు ఉపయోగపడు నాబ్స్ .ఇవి రెండు పక్కలా ఉండును. ఇవి కాక సునిశితంగా కదుపుకొనుటకు మరియొక నాబ్స్ కుడా ఉండును
సూక్ష్మ దర్శిని వాడునప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. సూక్ష్మ దర్శినిని ఎల్లవేళలా పరిసుభ్రముగా ఉంచుకొనవలెను
2. ప్రయోగశాలలో వొక ప్రదేశములో వుంచి బాగుగా గాలి వెలుతురు వున్నా ప్రదేశములో ఉంచ వలెను.
3. కటకములను చేతితో తాకరాదు
4. వాడిన తరువాత కటకములను లెన్సు క్లీనింగ్ పేపర్ తో క్లీన్ చేయవలెను
5. ఎట్టి పరిస్థితులలొనూ స్వయంగా రిపేరు చేయరాదు
6. కోర్సు నాబ్ ను ఉపయోగించునపుడు నెమ్మదిగా దించవలెను. కొంతవరకు దించిన తరువాత ఫైన్ నాబ్ను వుపయోగించ వలెను.

Subscribe to:
Posts (Atom)