Friday 26 October 2012

vulava boorlu

                                      

                                       ఉలవ బూరెలు 

తయారు చేయుటకు కావలసిన పదార్ధాలు :
  • ఉలవలు                             1 కప్పు 
  • కోరిన బెల్లం                         1 కప్పు 
  • మినప పప్పు                        1/2 కప్పు 
  • బియ్యం                               1 కప్పు 
  • యాలకుల పొడి                    1 టీ స్పూను 
  • నూనె                                   తగినంత 
తయారు చేయు విధానము: 

ముందుగా మినపపప్పుని,బియ్యాన్ని  2 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో రెండు స్పూన్ల కోరిన  బెల్లం, చిటికెడు ఉప్పు కలిపి వుంచుకోవాలి.(బూర్ల తోపునకు )
ఉలవలు దోరగా వేపి, కడిగి కుక్కరులో 5-6 విజిల్సు వచ్చే దాకా ఉడికించుకోవాలి.చల్లారిన తర్వాత గ్రిండర్   లో మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత బెల్లం పాకం చేసుకొని(బెల్లం కరిగినంతవరకు ) రుబ్బిన ఉలవ ముద్దను వేసి దగ్గరగా చేయాలి. అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ ముద్దతో కావలిసినంత సైజు లో ఉండలు గుండ్రంగా చేసుకోవాలి .ఈ ఉండలను తోపులో ముంచి నూనెలో వేపాలి.

వేడి వేడి గా తింటే (నేతితో కలిపి ) చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచివి. అప్పుడప్పుడు చేసుకోవచ్చును.

                                                                                        శ్రీమతి. జి. వెంకట లక్ష్మి


c/o డా. జి.బి.హరనాద్   
11, సాయి సౌద ఎపార్ట్మెంటు, బాలయ్య శాస్త్రి లేఅవుట్, 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ దరి
విశాఖపట్నం -13  ఫోను నెంబర్ :9247582402, 9848721121.     

No comments:

Post a Comment