Saturday 6 October 2012

resistrum trial


రెసిస్ట్రుం మరియు రెసిస్ట్రుం పి .బి ( గయోకాన్ ఫార్మా లిమిటెడ్ ) లేగదూడల లో మందుల యొ క్కప్రభావం ( ఎదుగుదల మరియు వ్యాధి నిరోధక శక్తిఫై ) తెలిసికొనుటకు చేయు పరీక్ష .

లక్ష్యములు : సంకరజాతి మరియు గేదె దూడలలో ఎదుగుదల మరియు వ్యాదుల నిరోధక శక్తిని పరీక్షిం చుట కొరకు, తద్వారా మందులయొ క్క ప్రభావమును తెలుసుకొనుట కొరకు.

మందులయోక్క వివరములు: రె సిస్ట్రుం మరియు రె సిస్ట్రుం పి .బి  గయోకాన్ ఫార్మా లిమిటెడ్ వారిచే ఉత్పత్తి చేయబడినవి. రె సిస్ట్రుం పశువుల ముర్రు పాలనుండి తీయబడినవి.దీనిలో వ్యాధి నిరోధక శక్తి నిచ్చు ఇమ్యునోగ్లోబ్యులిన్స్, ఎదుగుదలకు పనికివచ్చు పోషకములు బయోయక్తివ్ పదార్దములు వున్నవి. ఇవి మానవులలో  వైరస్, బాక్టీరియా, ఎలర్జీ  వల్ల  కలుగు వ్యాదులనుండి రక్షణ, బరువు పెరుగుటకు ఉపయోగపడినవని ద్రువీకరించుట జరిగినది. ఈ ప్రయోజనాల వల్ల ఈ మందులను లేగదూడలలో వాడి వాటియొక్క ఎదుగుదలను మరియును వ్యాధి నిరోధక శక్తిని పరీక్షించి పలితములను తెలిసుకొనుటకు  ఈ చిన్న ప్రయోగమును ప్రతిపాదించుచున్నాము.

పరీక్ష చేయు విధానము:పైన తెలిపిన ప్రయోజనముల దృష్ట్యా ఈ మందులను పూర్తిగా వినియోగించుటకు ముందుగా ఒక చిన్న ప్రయోగమును లేగదూడలలో  జరిపి చూడవలెనని ఈ ప్రతిపాదన చేయుట జరిగినది. ముందుగా 20 లేగదూడలను ఎంపిక చేసి ఈ మందులను ఇచ్చి వాటి యొక్క బరువును ఒక క్రమ పద్దతి లో పరీక్ష చేసి మరియు వ్యాధి నిరోధక శక్తిని పరీక్ష చేయుట జరుగును. ఇది 6 నెలలలో పూర్తియగును. పూర్తి వివరములు మందులను వాడు విధానములను దూడలను గ్రామాలను ఎంపిక చేసిన తదుపరి తెలుపబడును.

 

 

 

    

No comments:

Post a Comment