Wednesday, 17 October 2012

song by dr.soma




పల్లవి :                    ఓ మధు పాయీ ఓ మధుపాయీ
                               ఎటకే  ఈ పూట  వనిలో ఎదే నీ బాట
చరణం :                  కన్నె సుమములు అభిసారికలై  కాచుకున్నవి నీ కోసం
                               సప్తవర్ణముల రేఖలు విరిచూచుచున్నవి నీకోసం
పల్లవి :                    ఓ మధు పాయీ ఓ మధుపాయీ
                               ఎటకే  ఈ పూట  వనిలో ఎదే నీ బాట
చరణం :                  చంద్రుని కోరే చకోరములవలె ఎదురు చూచె నీ సుమబాలలు మరి
                               ఎందుకే జాగు ఎగురుతుపోవే ఉషోదయమ్మున నిషా కొరుతూ
పల్లవి :                    ఓ మధు పాయీ ఓ మధుపాయీ
                               ఎటకే  ఈ పూట  వనిలో ఎదే నీ బాట
చరణం :                   బిరానపోయి సరాగ ధూళితో సరాగమాడి తరించి పోవే
                                ఝుమ్మని నాదం కమ్మగ మీటే ఝుంటి తేనియలు  జుర్రుకు రావే
పల్లవి:                      ఓ మధు పాయీ ఓ మధుపాయీ
                               ఎటకే  ఈ పూట  వనిలో ఎదే నీ బాట



         Dt/  14-10-2012
         Visakhapatnam                                                                         రచయిత : డా. సోమ  

item song by dr soma



పల్లవి :           ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం 
చరణం :          నెత్తిమీద కూర తట్ట నోటిలోన ఘాటుచుట్ట 
                       నత్తనడక వన్నెలాడి నాకు నచ్చేవే ఇచ్చైవే వచ్చైవే  
పల్లవి :            ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం
చరణం :          కూర బేరమాడ వస్తే చుట్ట మాట కడ్డు వస్తే 
                       దింపలేక  గింగెక్కని   గింగెక్కని గింగిరాలు  పోయావే 
                      నువ్వు నాకు  నచ్చేవే ఇచ్చైవే వచ్చైవే
పల్లవి:             ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం 
చరణం            కిందెట్టని  అనలేక గింగెట్టని నువ్వంటే గంగ వెర్రులేసింది 
                       నా మనసు  గిర్రని బొంగరంలా తిరిగింది నా వయస్సు  
                       నచ్చేవే ఇచ్చైవే వచ్చైవే
కోరస్:            గింగెట్టు తట్టని గింగెట్టు ఒంగెట్టు బుట్టని ఒంగెట్టు   
                      ఒంగిగింగ పెట్టి నీవు బుట్టలోన సరుకంతా చూపెట్టు  
                      కాదంటే నా వొట్టు  అద్దిగది ఆహా ! అద్దిగది  ఓహో అగ్గిగది 
పల్లవి:             ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం 

చరణం 4:         బుట్ట దించి నేను చూస్తే తాజాగా లేత లేత వంకాయలూ 
                       ముల్లంగి  మునగా మరి టెంకాయలూ  
పల్లవి:             ఓలమ్మి కూరలమ్మి పోకే నువయ్యారం చాల్లే నీ సింగారం 

చరణం 5:        పున్నాగ పువ్వులాగ  సన్నాయి నడుము దాన
                      చాల్లే నీ వయ్యారం ఒగ్గై నీ  సింగారం ఇచ్చై నీ బంగారం 




విశాఖపట్నం                                                        రచయిత : డా. సోమా 
14/10/2012                                                                          













Sunday, 14 October 2012

సూక్ష్మదర్శిని

సూక్ష్మదర్శిని (Microscope)

పశువుల వ్యాధులకు  కారకములయిన సూక్ష్మజీవుల గూర్చి తెలుపు పశువైద్య శాస్త్ర విభాగమును  "పశువైద్యసూక్ష్మజీవ శాస్త్రము " అని అందురు.( Veterinary Micro Biology) ఈ శాస్త్రములో అంటు  వ్యాధులు, వాటియొక్క కారకములను గుర్తించుట, పశువుల ఫై అవి చూపు ప్రభావములను, నిరోధించు మార్గములను, మరియు వ్యాధుల నివారణ మొదలగు అంశములను ఈ శాస్త్రములో చర్చించెదరు.
పూర్వము సూక్ష్మదర్శినిని  కనుగొనక ముందు వ్యాదులకు కారకము లైన సూక్ష్మజీవుల యొక్క ఉనికి తెలియకపోవుట చే గాలి, దెయ్యము మొదలగు వాటివల్ల వ్యాదులు వస్తాయని భావించే వారు. తదుపరి శరీర తత్వము , ఆహార లోపాలవల్ల  వ్యాదులు వస్తాయని విస్వసిం చే వారు.
కాలక్రమేణా సూక్ష్మదర్శినిని కనుగొన్న తర్వాత వ్యాదుల కా రణములను సూక్ష్మజీవులుగా గుర్తించ గలిగిరి. ఈ ఘనత అంటోని లీవెన్ హుక్ కే దక్కుతుంది. ఈ సూక్ష్మదర్శినిని కనుగొన్న రెండు శతాభ్దముల తర్వాత సూక్ష్మజీవుల యొక్క పూర్తి వివరములు తెలుసుకో గలిగారు. ఈ ఘనత లూయి పాక్చరుకే దక్కుతుంది. అందువలన  లూయి పాక్చరును  సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు గా పిలిచెదరు.(Father of the modern microbiology) .

ఆంటోని లీవెన్ హుక్ అను శాస్త్రజ్ఞుడు సూక్ష్మ దర్శిని ని కనుగొన్నాడు. ఇతడు హాలండ్  దేశస్థుడు. (1632-1723).ఈయన విభిన్న రకములైన సూక్ష్మ దర్శినిలను కనుగొన్నాడు. సుమారు 250 రకములైన సూక్ష్మ దర్సినులను స్వయంగా ఉత్పత్తి చేసాడు. ఈయన చే తయారుకాబడిన సూక్ష్మ దర్సినులకు ఆకాలంలో  విశేష ప్రాచుర్యం లభించినది. అతి చిన్న కంటికి కనిపిచని వస్తువులను ఎన్నో రెట్లు పెద్దవిగా చేసి చూపించగల పరికరం సూక్ష్మ దర్శిని. సూక్ష్మజీవులయొక్క పరిమాణం, ఆకృతి వంటి భౌతిక లక్షణాలను సూక్ష్మ దర్శిని సహాయంతో పరిసీలిచుటకు వీలు కల్గుతుంది.

  సూక్ష్మదర్శినిలో రకాలు : 

1. సాధారణ సూక్ష్మ దర్శిని (Simple microscope/ Light Microscope): దీనిలో వస్తువు యొక్క పరిమాణంను పెంచుటకు కటకములను, కాంతిని ఉపయోగిస్తారు. ఇందులో 1000 రెట్లు వస్తువుయొక్క పరిమాణంను పెంఛి  చూపవచ్చును.
2.సంయుక్త సంయోగ సూక్ష్మ దర్శిని (Compound Microscope): ఇది సాధారణంగా సూక్ష్మ జీవ శాస్త్రం లో ఉపయోగించే పరికరము. దీనిలో ఏకాక్షక , ద్వియాక్షక అను రెండు రకములైన వి వుంటాయి. ఏకాక్షక సూక్ష్మ దర్సినిలో వొక కన్నుతోనే చూడగలము.ద్వియాక్షక సూక్ష్మ దర్సిని లో రెండు కళ్ళ తొనూ చూడగలము.(Monoocular, Binocular microscopes). ఏకాక్షక సూక్ష్మ దర్సినితో  ఎక్కువ సేపు పరిక్ష చేయుటకు వీలు పడదు. ద్వియాక్షక సూక్ష్మ దర్సినీతో  రెండు కళ్ళ తొనూ పరీక్ష చేయుటకు వీలు కలుగుతుంది..ఈ సంయుక్త సూక్ష్మ దర్సినిలో చాలా రకములు యున్నవి .
ద్యుతిక్షేత్ర సూక్ష్మ దర్శిని (Bright field microscope): ఇది సాధారణంగా వాడే సూక్ష్మ దర్శిని. ఎక్కువ కాంతిని ఉప యో గించి  సూక్ష్మ జీవులను పరీక్షిం చెదరు. వస్తువులు కాంతిని స్వీకరించుట చేత కాన్తిరహితముగా కనిపిస్తాయి . అందువలన సూక్ష్మ జీవులను పరీక్షించుటకు వస్తువులను అభిరంగితము చేయవలెను( Staining). చాలా రకములయిన స్టైన్స్ ను వాడి సూక్స్జ్మ జీవుల ఆకృతి, మొదలగు అంశములను పరీక్షిం చెదరు
కాంతిరహిత సూక్ష్మ దర్శిని:( Dark field microscope):దీనిలో వస్తువు కాం తి రహితంలో కాంతిగా కనిపిస్తుంది .వొక ప్రత్యేకమైన కన్దెన్ సర్ ను ఉపయోగించి కాంతిని వొక ప్రత్యేకమైన కోణంలో ప్రసరింప చేస్తారు .సిఫిలిస్ , మొదలగు వాటిని దీనితో పరీక్షింస్టారు.అభిరంజితము చేయకుండా సూక్ష్మ జీవులను ఈ పరికరము సహాయంతో సులువుగా  పరీక్షించవచ్చును.
వత్యాతదశ   నిరూపణ సూక్ష్మ దర్శిని (Phase contrast Microscope): దీనిలో వొక ప్రత్యేకమైన కండెన్సర్ ద్వారా కాంతిని వొక విభిన్న మార్గంలో ప్రసరింప చేస్తారు అం దువలన వస్తువు ప్రస్పుటంగా కనిపిస్తుంది.సూక్ష్మ క్రిములను అభిరంజితము చేయకుండా చూడ వచ్చును .
ప్రతిదీప్త సూక్ష్మ దర్శిని ( Fluorescent microscope): ఈ సూక్ష్మ దర్శిని ద్వారా చూచునపుడు కాంతితో మెరిసె డైతో  స్టైన్ చేసి అధిక శక్తితో కాంతిని వేద జల్లే  హలోజిన్ బల్బు గాని మెర్సురిక్ వ్యాపర్  బల్బు గాని ఉపయోగించి కాంతిని ప్రసరింప చేయుదురు. అందువలన సూక్ష్మ క్రిములను సులభంగా గుర్తించుటకు వీలుకల్గుతుంది.
ఎలక్ట్రాన్ మైక్రో స్కోపు (Electron microscope): అత్యంత ఆధునికమైన సూక్ష్మ దర్శిని. దీనిలో ఎలక్ట్రాన్ కిరణములను ఉపయోగించి సామాన్య సూక్ష్మదర్శిని కన్నా ఇంకను 1000 రెట్లు పెద్దదిగా చేసి చూపించగలదు.సూక్ష్మ జీవులోగల కణములను ఇతర సూక్ష్మ భాగములను, వైరస్ లను,దీనితో సులభంగా చూడవచ్చును.
సూక్ష్మ దర్శిని లోగల భాగాలు :
1.కంటితో చూచే కటకం (eye piece)
2. Revolving nose piece( వస్తు కటకంలను త్రిప్పుకునే సాధనం ): దీనిలో 10X, 20X,40X, 100X కటకములను అమర్చేదరు.దీని సహాయంతో  ఏదైనా వొక కటకంతో చూడవచ్చును.
3.వస్తుకటకములు (objectives)
4.స్టేజి: ఇది నిలువుగాను అడ్డంగాను కడుపుకొని స్టేజి పైన పెట్టిన స్లైడ్ ను కదుపుకోనవచ్చును.
5.కండెన్సర్: కిరణములను రుజుకిరణములుగా మారుస్తుంది. దీనిలో వున్న  డయాఫ్రం ద్వారా కాంతి కిరణ ములను తగ్గించుట, హెచ్చిం చుట చేయవచ్చును.
6. లైట్ సోర్సు
7.స్టేజి క్లిప్స్ : స్లైడ్ ను పట్టి కదలకుండా ఉంచుటకు తోడ్పడుతుంది
8. మైక్రోస్కోప్ ను పైకి, క్రిందికి కదుపుకోనుటకు ఉపయోగపడు నాబ్స్ .ఇవి రెండు పక్కలా ఉండును. ఇవి కాక సునిశితంగా కదుపుకొనుటకు మరియొక నాబ్స్ కుడా ఉండును

సూక్ష్మ దర్శిని వాడునప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. సూక్ష్మ దర్శినిని ఎల్లవేళలా పరిసుభ్రముగా ఉంచుకొనవలెను
2. ప్రయోగశాలలో వొక ప్రదేశములో వుంచి బాగుగా గాలి వెలుతురు వున్నా ప్రదేశములో  ఉంచ వలెను.
3. కటకములను చేతితో తాకరాదు
4. వాడిన తరువాత కటకములను లెన్సు క్లీనింగ్ పేపర్ తో క్లీన్ చేయవలెను
5. ఎట్టి పరిస్థితులలొనూ స్వయంగా రిపేరు చేయరాదు
6. కోర్సు నాబ్ ను ఉపయోగించునపుడు నెమ్మదిగా దించవలెను. కొంతవరకు దించిన తరువాత ఫైన్ నాబ్ను వుపయోగించ వలెను.     











 

 

Saturday, 6 October 2012

resistrum trial


రెసిస్ట్రుం మరియు రెసిస్ట్రుం పి .బి ( గయోకాన్ ఫార్మా లిమిటెడ్ ) లేగదూడల లో మందుల యొ క్కప్రభావం ( ఎదుగుదల మరియు వ్యాధి నిరోధక శక్తిఫై ) తెలిసికొనుటకు చేయు పరీక్ష .

లక్ష్యములు : సంకరజాతి మరియు గేదె దూడలలో ఎదుగుదల మరియు వ్యాదుల నిరోధక శక్తిని పరీక్షిం చుట కొరకు, తద్వారా మందులయొ క్క ప్రభావమును తెలుసుకొనుట కొరకు.

మందులయోక్క వివరములు: రె సిస్ట్రుం మరియు రె సిస్ట్రుం పి .బి  గయోకాన్ ఫార్మా లిమిటెడ్ వారిచే ఉత్పత్తి చేయబడినవి. రె సిస్ట్రుం పశువుల ముర్రు పాలనుండి తీయబడినవి.దీనిలో వ్యాధి నిరోధక శక్తి నిచ్చు ఇమ్యునోగ్లోబ్యులిన్స్, ఎదుగుదలకు పనికివచ్చు పోషకములు బయోయక్తివ్ పదార్దములు వున్నవి. ఇవి మానవులలో  వైరస్, బాక్టీరియా, ఎలర్జీ  వల్ల  కలుగు వ్యాదులనుండి రక్షణ, బరువు పెరుగుటకు ఉపయోగపడినవని ద్రువీకరించుట జరిగినది. ఈ ప్రయోజనాల వల్ల ఈ మందులను లేగదూడలలో వాడి వాటియొక్క ఎదుగుదలను మరియును వ్యాధి నిరోధక శక్తిని పరీక్షించి పలితములను తెలిసుకొనుటకు  ఈ చిన్న ప్రయోగమును ప్రతిపాదించుచున్నాము.

పరీక్ష చేయు విధానము:పైన తెలిపిన ప్రయోజనముల దృష్ట్యా ఈ మందులను పూర్తిగా వినియోగించుటకు ముందుగా ఒక చిన్న ప్రయోగమును లేగదూడలలో  జరిపి చూడవలెనని ఈ ప్రతిపాదన చేయుట జరిగినది. ముందుగా 20 లేగదూడలను ఎంపిక చేసి ఈ మందులను ఇచ్చి వాటి యొక్క బరువును ఒక క్రమ పద్దతి లో పరీక్ష చేసి మరియు వ్యాధి నిరోధక శక్తిని పరీక్ష చేయుట జరుగును. ఇది 6 నెలలలో పూర్తియగును. పూర్తి వివరములు మందులను వాడు విధానములను దూడలను గ్రామాలను ఎంపిక చేసిన తదుపరి తెలుపబడును.

 

 

 

    

Tuesday, 2 October 2012

pharmacology 2 nd paper


       విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్ , విశాఖపట్నం 

                                             ఫార్మకోలజీ ప్రశ్న పత్రము -రెండవ భాగము 

                                                                                                                            మార్కులు 50

  అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను 

________________________________________________________________________________

1.థిరప్యూ టి క్స్ ( Therapeutics) అనగా ...............................................................................................

2.మేటేరియా మేడికా అనగా.....................................................................................................................

3.సాధారణముగా వాడు రెండు  యాన్టాసిడ్  ను తెలుపుము ................................................................

4.యాన్టిసే సేప్టిక్స్కికి ,  దిసిన్ ఫెక్ టెంట్స్కి కి గల తేడా లనుతేలుపుము......................................................................................................................

...................................................................................................................................................................

5. స్టోమకిక్స్ అనగా ...................................................................................................................................

6. డైయూరిటిక్స్  అనగా              (    ) పెట్టండి 

అ ) లాలజలమును అధికముగా వుత్పత్తి  చేస్తాయి . బి ) మూత్రమును ఎక్కువగా వుత్పత్తి చేస్తాయి 

 సి  ) విరోచనాలను అరికట్తాయి. డి ) మత్తు కలిగిస్ట్టాయి 

7. దిమల్సెంట్స్ (    ) పెట్టండి 

అ )మ్యూకస్ పొరల ఫై కలుగు మంటలను వుపసమింప చేస్త్తాయి . బి ) పుళ్ళను మాన్పుతాయి .సి ) క్రిమిసంహారము గా పనిచేస్తాయి డి ) మంటలను పుట్టిస్తాయి 

8.క్రిందివాటిలో  Rubifacients ను గుర్తించుము?

అ ) లినిమేన్ట్స్ బి ) అయోడిన్ ఆయిన్టు మెంటు   సి ) క్యాం ఫర్   డి) అన్నియును 

9. కాస్తిక్స్ ను గుర్తించుము 

అ) బొరిక్ యాసిడ్. బి) గంధకము .సి) పోటాసియం హైడ్రో క్సిడ్  డి) ఉప్పు ( sodium chloride)

10. లూగాల్స్ అయొడిన్ 1-2% ద్రావకమును 

అ) జీర్నసక్తి  కొరకు  బి) గర్బాశయ వ్యాధుల్లో సి) అంటువ్యాదులు వచ్చినపుడు  డి) కడుపు పొంగునకు 

వాడుదురు 

11. గ్లిసరిన్ యొక్క ముఖ్యమైన ఉపయోగములు 

అ) బోరోగ్లిసరిన్  గా  నోటిలోని పుళ్ళకు  బి) లేగదూడలకు ఎనిమా గా  సి)  అయోడిన్ ఆయింట్ మెంటు తయారీలో డి) ఫై  అన్నింటిలోను 

12. యాం టి బయోటిక్స్ ను  సాధారణంగా  దేనికి వాడెదరు?  ..........................................................................................................................................................

13.యాంటిబయోటిక్స్ ను గుర్తించుము ?

అ) పెనిసిల్లిన్ బి) యామ్పిసిల్లిన్  సి) టేర్రామిసిన్  డి)   అన్నియును 

14. క్రిందివాటిలో వృక్ష సంభదిత మందులను గుర్తించుము 

అ) నక్సువోమికా  బి) జేన్సియన్ సి ) బెల్లడోన డి) అన్ని 

15.పోటాస్సియం నైట్రేట్  యొక్క ముఖ్యమైన వుపయోగములను  తెలుపుము ........................................

...................................................................................................................................................................

.....................................................................................................................................................................

16.దూడలలో కొమ్ములు రాకుండా చేయుటకు వాడు మందు .................................................................

17. మిక్చురా  ఆల్బ  అనగా ................................................................................................మిశ్రమము.

18. క్రింది వాటిని జత పర్చుము ?

1. సోడియం బైకార్బొనేట్                             క్రిమిసంహారిణి 

2. పోటాషియం పెర్మంగానేటు                      నొప్పి నివారిణి 

3. శొంటి                                                       బాహ్యా  పరాన్న జీవులను చంపును 

4. గంధకము                                               స్తోమకిక్ 

5. యయోడిన్  లేపనము                            క్షారము   

19. మేల్బోరాసిస్  అనగా ...........................................................................................................................

..............................మిశ్రమము .

20. Gastric sedatives గాస్త్రిక్ (సేడేటివిస్) అనగా ................................................................................................................................................................

21. ఏమిటిక్సి  అనగా ................................................................................................................................

22. ఎక్స్పేపెక్స్ టొరెంట్స్ ( expectorents) అనగా ......................................................................................

...............................................................................................................................................................

23. ట్రిచ్యురేషాన్  అనగా ........................................................................................................................

24.కమిన్యూషాన్ అనగా .......................................................................................................................

25. బాక్టేరిసైడల్  మందులు అనగా ........................................................................................................

                                                xxxx -----------------------------------xxxxx     

Sunday, 30 September 2012


                              విశాఖ డైరీ ట్రైనింగ్ సెంటర్ , విశాఖపట్నం 

                                   ఫార్మకోలజి పరీక్షా ప్రశ్న పత్రము   -1            మార్కులు 50

                             అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను  

1. మందులను పశువులకు ఏ ఏ రూపములలో ఇచ్చెదరు ? ద్రవ రూపములో మందులు ఇచ్చునపుడు     
    తీసుకోవలసిన  జాగ్రత్తలు తెలుపుము? ఇచ్చు విధానమును వివరించుము?

2 ఎలక్చురి .( Electuary) అనగా ఏమిటి ? ఏ మందులను ఈ రూపంలో ఇచ్చెదరు ? వుపయోగములను తెలిపి
    కొన్ని వుధహరణలను  ఇమ్ము ?

3. ఏ ఏ అంశములు మందులయోక్క పనిని ప్రభావితం చేస్తాయి ? క్లుప్తముగా వివరించండి ?

4.ఈ క్రింది మందుల యొక్క భౌతిక , రసాయనక , గుణములను వాటియొక్క ఉ పయోగములను, విని యోగించు
   పద్దతులను వివరించండి ?
           - పల్విస్ జింజిబెరిస్ ( pulvis zinzer)
           -పొటాసియం పెర్మంగనేటు
           -గ్లిసరిన్
           - జింకు ఆ క్సిడ్

5. ఈ  క్రింది మందులను తాయారు చేయు విధానమును , వుపయోగములను  తెలుపుము ?
      సల్ఫర్ ఆఇన్ టిమెంటు , నేమ్లెంటు , లుగాల్స్ అయోడిన్   







       

Saturday, 29 September 2012

item song by dr. soma

 

 

పల్లవి :        ఎ పి పి ఎ ల్ ఈ  ఓలమ్మో ఎ పి పి ఎ ల్ ఈ

                  హ్యాపీ ఫీ లయ్య వోరబ్బో  హ్యాపీ ఫీ లయ్యా 

                  హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ...........

చరణం :      పాపల్రా భలే రూపు షే పుల్రా 

                  షోకుల్రా భలే ఘాటు సొంపుల్రా 

                  పచ్చదనం  చూస్తేనే పైనాపిల్ 

                  వుక్కుగుండె చూస్తుంటే  వుడ్డే పిల్ 

కోరస్ :        పచ్చదనం  వారేవా పసిడి దనం 

                  ఉక్కు దనం వారెవ గట్టిదనం 

 పల్లవి :       ఎ పి పి ఎ ల్ ఈ....................

చరణం 2:     నాలుగించిన్నడుము  చూ డు  డౌటే  డౌటు 

                   నాట్య మంటి  నడక చూడ  అవుటే   అవుటే 

                   చేమ్మచకా చిత్తడి చెమ్మచెకా 

                   చెకా చెకా తడి తడి తకా తకా 

                   ఎ పి పి ఎ ల్ ఈ....................

చరణం :      మెత్త నై న  కన్నె సొగసు  కస్టర్డ్  ఆపిల్ 

                   సిగ్గులూరు బుగ్గ జూడ సిమ్లా ఆపిల్ 

                   మూడించీల ముక్కు చూడ ముద్దే ముద్దు 

                    నిండు  గుండె   నిడివి జూడ  హద్దే  హద్దు 

కోరస్ :         జడీ జడీ వానలో తడీ  తడీ 

                   తడీ  పొడీ భామల  వోడిబడి 

పల్లవి :         ఎ పి పి ఎల్ ఈ ............    

 

29/9/2012

విశాఖపట్నం                                                           డా . సోమ 

                                                                     ( డా .యస్ .యస్ .మూర్తి )